Rain Alert | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. నిన్న కురిసిన భారీ వర్షానికి నగరమంతా అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు పలు రహదారులు జలమయం అయ్యాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు నరకం చూశారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. మొత్తంగా నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
ఇవాళ కూడా అంటే శుక్రవారం సాయంత్రం కూడా నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి అంత వర్షం కురిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకు ఎలాంటి వర్ష సూచన లేదన్నారు. సాయంత్రం వేళ పలుచోట్ల ఉరుములు, మెరుపులు సంభవించనున్నాయి.
ఇక మరో రెండు గంటల్లో మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ – 8333068536
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ – 8712596106
హైడ్రా – 9154170992
ట్రాఫిక్ – 8712660600
సైబరాబాద్ – 8500411111
రాచకొండ – 8712662999
టీజీఎస్పీడీసీఎల్ – 7901530966
టీజీఎస్ఆర్టీసీ – 9444097000
జీహెచ్ఎంసీ – 8125971221
హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ – 9949930003