Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, చిరుజల్లులు కూడా ఉదయం వేళనే కురిసే అవకాశం ఉందన్నారు. రాబోయే మూడు రోజుల్లో 20 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్ మినహా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
Gadwal | ఆ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ.. 18 కి.మీ. పాదయాత్ర చేసిన విద్యార్థులు
SHAMBHALA | పాపులర్ నేమ్‌తో.. ఈ సారి హిట్ పక్కా అంటున్న ఆది సాయికుమార్ శంబాల లుక్