SHAMBHALA | హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న యాక్టర్లలో ఒకరు ఆదిసాయికుమార్ (Aadi Saikumar). చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సారి మాత్రం పక్కా ప్లాన్‌తో వస్తున్నాడని తాజా సినిమా లుక్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆది నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ శంబాల (SHAMBHALA). డిసెంబర్ 23న ఆది సాయికుమార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శంబాల ఫస్ట్ లుక్ లాంచ్ చేశారని తెలిసిందే. మంటల మధ్యలో నుంచి సైకిల్‌పై వస్తున్న ఆది లుక్ నెట్టింట క్యూరియాసిటీ పెంచుతూ.. సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఏ యాడ్ ఇన్ఫినిటీ ఫేం యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అర్చనా అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్, అన్నభీమోజు, మహిధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇదివరకెన్నడూ టచ్ చేయనట్వంటి పాయింట్, స్టోరీతో ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ రాబోతుంది. ఈ చిత్రంలో ఆది జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నాడు. హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో.. విజువల్ ఫీస్ట్‌లా సినిమా ఉండబోతుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఈ మూవీకి శ్రీమ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో శంబాల ప్రపంచం ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడిదే పేరుతో సినిమా చేస్తూ ఈ సారి హిట్ పక్కా అంటూనే.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు ఆది సాయికుమార్.
ఆది సాయికుమార్ శంబాల లుక్..
#Shambala pic.twitter.com/PKyHkktndX
— Aadi Saikumar (@iamaadisaikumar) December 23, 2024
Team #SHAMBHALA: A Mystical World 🔥 came together to celebrate Promising Star @iamaadisaikumar’s birthday pic.twitter.com/5IIvTJUxus
— Vamsi Kaka (@vamsikaka) December 23, 2024
Max Trailer | ప్రతీ పకోడిగాడు సమాజ సేవకుడే.. స్టన్నింగ్‌గా కిచ్చా సుదీప్ మాక్స్ ట్రైలర్
Bollywood 2024 | బాలీవుడ్‌కు కలిసి వచ్చిన 2024.. టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్ హిందీ సినిమాలివే..!
Pooja Hegde | పూజా హెగ్డే 2024 రౌండప్.. నో యాక్షన్.. నో రిలీజ్