హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్న, ఇవాళ అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. ఇక రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కిందిస్థాయి గాలులు వాయువ్య దిశల నుంచి తెలంగాణ వైపునకు వీస్తుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు ఖాజాగూడలో 1.2 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు తెలిపారు.