Rains | హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా మొన్నటి వరకు ఎండలతో వేడెక్కిన నగర వాతావరణం ద్రోణి ప్రభావంతో కొంత చల్లబడింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలు, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.