Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైదర్ నగర్, బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, అమీర్‌పేట, మైత్రీవనం, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, ముషీరాబాద్, కోఠి, నారాయణగూడ, మలక్‌పేట, అంబర్‌పేట, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.