హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వాతావరణం కాస్త చల్లబడింది. శనివారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది.
సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాబోయే 2 గంటల్లో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Isolated thunderstorms likely in and around #Hyderabad in next 2hrs
— Telangana Weatherman (@balaji25_t) April 30, 2022