HYD Rains | హైదరాబాద్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం అస్తవ్యస్తమైంది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి వరద రోడ్లపై నిలిచిపోయింది. చెట్లు, స్తంభాలు కూలడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వెళ్లే రోడ్డుపై పడిపోవడంతో.. లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డుపై చెట్టుకూలడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. నాంపల్లి రెడ్‌హిల్స్‌లో రోడ్డుపై చెట్లు కూలిపోయాయి. రెడ్హిల్లో రోడ్డుపైనే ట్రాన్స్ఫార్మర్పై వృక్షం పడిపోవడంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ పేలిపోయింది.
ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అస్మాన్‌గఢ్ విద్యుత్ డివిజన్ పరిధిలో 67 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో జాప్యం జరుగుతున్నది. బషీర్‌బాగ్‌లో పీజీ లా కాలేజీ ముందు చెట్టు కూలింది. రోడ్డు మీదకు చెట్టు ఒరిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో పీజీ లా కాలేజ్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలుచోట్ల రోడ్లుపై నీరు నిలువడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. లంగర్‌హౌస్‌లోని బాపునగర్ కాలనీలోని చెట్టు నేలకూలింది. చెట్టు కూలడంతో విరిగిపడ్డ రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. బాపునగర్ కాలనీలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా.. పలుచోట్ల కూలిన చెట్లను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. మాదాపూర్-రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై వర్షం నీరు నిలువడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది.