హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానపడుతున్నది. చంపాపేట్, కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్, కొత్తపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, మన్సూరాబాద్, మీర్‌పేటలో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లిలో చిరుజల్లులు కురుస్తున్నాయి.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది.