హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన.. క్రమంగా అధికమైంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనరస్థలిపురం, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్, సికింద్రాబ్ స్టేషన్లో భారీ వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ముసురు కురుస్తున్నది.
కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది. ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది.