హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం ఎండకొట్టినప్పటికీ.. క్రమంగా మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, కూకట్పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అమీర్‌పేట, తర్నాక, చింతల్‌బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
నారాయణగూడ, హిమాయత్‌నగర్, మాదాపూర్, లింగంపల్లి, ఉప్పల్, ఓయూ క్యాంపస్, నాచారం, మల్లాపూర్, కాప్రా, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో భారీ వర్షం పడుతున్నది. చాదర్‌ఘాట్, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్లో వర్షం కురుస్తున్నది. అయితే ఒక్కసారిగా వరణుడు విరుచుకుపడటంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని వెల్లడించింది.