Hyd Rains | ఇటీవల హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలు, వరదలతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా నగరంలోని ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం మొదలైంది. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, బాచుపల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గంలో వర్షం పడుతున్నది. మల్కాజ్గిరి, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, దమ్మాయిగూడ, కీసర, చర్లపల్లి, ఉప్పల్, చిలుకానగర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, పంజాగుట్ట, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. అలాగే, అల్వాల్, శేరిలింగంపల్లి, కాప్రా, బేల్, కుత్బుల్లాపూర్, బాలాపూర్‌లో వర్షం కురుస్తున్నది. శామిర్పేట్, ఘట్కేసర్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వానపడుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.