Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. దీంతో నగర ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగింది. బుధవారం మధ్యాహ్నం వరకు కూడా ఎండ దంచికొట్టింది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రానికి వర్షం కురిసింది.
తార్నాక, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట, సికింద్రాబాద్, హబ్సిగూడ, బేగంపేట, సోమాజిగూడ, అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, అంబర్పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఎల్బీనగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహమూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాద్రాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది.