హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వాన కురుస్తున్నది. గురువారం రాత్రి మొదలైన వాన ముసురు (Rain) ఉదయం కూడా కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, లక్డీకపూల్, సెక్రటేరియట్‌తోపాటు పలు ప్రాంతాల్లో భారీ వాన (Heavy Rain) పడుతున్నది. సికింద్రాబాద్, ముషీరాబాద్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్, వనస్తలిపురం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బాలానగర్, శంకర్పల్లి, మోకిల, అమీర్‌పేట, కృష్ణాగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, సనత్‌నగర్, బోరబండ, యూసఫ్‌గూడా, ఫిల్మ్‌నగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, సంతోష్‌నగర్, చంపాపేటలో వర్షం కురుస్తున్నది.
లక్డీకపూల్, నాంపల్లి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక కోఠి, మొజంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒక వైపు భారీ వన కురుస్తుండటం, మరోవైపు వీధీ దీపాలు వెలుగకపోవడంతో వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు.
HyderabadRains WARNING 1 ⚠️🌧️
Dear people of Hyderabad, next round of MODERATE – HEAVY RAINFALL ahead in entire Hyderabad City next 2hrs. Plan accordingly, today WHOLE DAY we have ON AND OFF RAINS ⚠️⚠️
— Telangana Weatherman (@balaji25_t) September 26, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది.
శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.