హైదరాబాద్: హైదరాబాద్లో వర్షం (Rain) కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల వాన పడుతున్నది. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, మూసాపేట, నాంపల్లి, మలక్పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. నగరం మొత్తం మేఘావృతమై ఉన్నది. ఇక రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముంద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి అది బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
After massive storms in Central TG yesterday night, Hyderabad too got its share of unseasonal rains mainly South HYD with on and off showers since morning
Today will be again a Central, East TG stormy show expected during afternoon – night with HYD too will get scattered rains…
— Telangana Weatherman (@balaji25_t) December 8, 2024