Rain Alert | హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తనుంది. ఆదివారం రాత్రికి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. శనివారం రాత్రి 11గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాంపల్లి బేగంబజార్‌లో 11.7సెం.మీ., చార్మినార్‌లో 10.6సెం.మీ, ఖైరతాబాద్ 9.4సెం.మీ, ఆసిఫ్‌నగర్ 9.1సెం.మీ, హయత్‌నగర్‌లో 9.0సెం.మీ, ముషీరాబాద్‌లో 8.6సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 8.5సెం.మీ, అంబర్‌పేటలో 8.4సెం.మీ, బహదూర్‌పురలో 7.2సెం.మీ,అమీర్‌పేటలో 6సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
Today’s FORECAST ⚠️⛈️
Right now, INTENSE RAINS across parts of Kamareddy, Sircilla will continue for next 1-2hrs, later reduce
Today, POWERFUL THUNDERSTORMS expected again in South, Central, West TG like Sangareddy, Vikarabad, Rangareddy, Nalgonda, Mahabubnagar, Wanaparthy,…
— Telangana Weatherman (@balaji25_t) August 10, 2025