సిటీబ్యూరో, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గాలిలో తేమ 81 శాతంగా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురవనుందని వెల్లడించారు.