నిమజ్జనోత్సవాన్ని.. ప్రశాంతంగా పూర్తి చేద్దాం
గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు.
- రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనంపై సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు శాఖతోపాటు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, నీటిపారుదల, వైద్య, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నవరాత్రులు, నిమజ్జనం ఏర్పాట్లు, నిర్వహణ, భద్రత లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. అందరం కలిసి పనిచేద్దామని, ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన చెరువులు, కుంటలు, చిన్న చెరువులు, సరస్సుల్లోనే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు, భక్తులు అక్కడికి వచ్చే విధంగా సూచనలు చేయాలని సీపీ సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా శాఖలు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉంటూ 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. నిమజ్జన రూట్లలో మరమ్మతులు, శానిటైజేషన్‌తో పాటు నిమజ్జనం నిర్వహించే చోట స్విమ్మర్స్, భారీ క్రేన్లు, లైటింగ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు రాజేశ్ చంద్ర, అభిషేక్ మహంతి, బాలస్వామి, గిరిధిర్, శ్రీనివాస్, సాయిశ్రీ, మురళీధర్, ఉషా విశ్వనాథ్, శ్రీబాల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

