కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద.. గోపీనాథ్ కూతుళ్ల్లతో పాదయాత్ర
అల్లాపూర్, అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బాబాసైలానీనగర్లో మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా కుమార్తెలు అక్షర, దిశిరతో కలిసి ఎమ్మెల్యే వివేకానంద గురువారం నిర్వహించిన ఉపఎన్నిక ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కేసీఆర్ పాలనలో అమలు చేసిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉండేవారని, నేడు రేవంత్ 22 నెలల పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.
మెజారిటీయే లక్ష్యంగా పనిచేయాలి
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
బంజారాహిల్స్,అక్టోబర్ 30: ఉప ఎన్నికలో మెజారిటీ సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. గురువారం రహ్మత్‌నగర్ డివిజన్లోని ముఖ్య నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. రహ్మత్‌నగర్ డివిజన్లోని పలు బస్తీల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.