జీడిమెట్ల, ఏప్రిల్ 23 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వందలాది మంది యువకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం కొంపల్లిలోని సరోజిని గార్డెన్స్‌లో జీడిమెట్ల డివిజన్ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీడిమెట్ల డివిజన్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 400 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పక్ష నాయకులు చేసే దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 50 రోజులుగా సాగుతున్న ప్రగతి యాత్రలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టత కోసం యువకులు అహర్నిషలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సోమేశ్ యాదవ్, పొలే శ్రీకాంత్, కస్తూరి బాలరాజు, వేణు యాదవ్, నగేశ్‌రెడ్డి, సూర్యప్రభ, పద్మజారెడ్డి నాయకులు కుంట సిద్ధిరాములు, నవీన్, నదీమ్ రాయి, అడపా శేషు, ఇందిరాడ్డి పాల్గొన్నారు.