Water | కుత్బుల్లాపూర్: మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో తమ కాలనీలో ఏర్పడిన నీటి సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కొద్దిరోజులుగా తమ కాలనీలో మంచి నీళ్లు సరిగ్గా రావడం లేదని.. సత్వరమే నీటి కొరత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. ఈ ఫిర్యాదుపై జలమండలి అధికారులు సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని డీజీఎం రాజేశ్ హామీ ఇచ్చారు.