ఉస్మానియా యూనివర్సిటీ, మే 30: తార్నాక డివిజన్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాలాపేటలోని సాయినగర్‌లో చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించిన ఆయన పనుల్లో జాప్యం చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తిం చేశారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం లాలాపేటలోనే రూ.ఆరు కోట్లతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్, రూ.6.99 కోట్లతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిర్మాణా న్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు పద్మారావుగౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పథకాల అమలులో తెలంగాణ అగ్రస్థానం
పేద ప్రజలకు ఉపకరించే పథకాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తుందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీతాఫల్‌మండిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పత్రాలను అందజేశారు. అడ్డగుట్ట డివిజన్‌ను చెందిన వంశీకుమార్కు రూ.1.5 లక్షలు, సీతాఫల్మండి డివిజన్‌కు చెం దిన రమేశ్‌కు రూ.లక్ష నిధుల మంజూరు పత్రాలు (ఎల్వోసీ)లను వారికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు సికింద్రాబాద్ పరిధిలో అత్యధిక సంఖ్యలో ప్రజ లు అందుకుంటున్నారని చెప్పారు. దీనికి కోసం అవసరమైన కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.