అల్లాపూర్,జనవరి23: దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజల సంక్షేమాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి రూ.3 కోట్ల 65లక్షల వ్యయంతో సీసీరోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఎనిమిదేండ్ల కిత్రం అల్లాపూర్‌లో ఏ కాలనీ చూసిన సమస్యలే స్వాగతం పలికేవని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు.
ఆర్కే సొసైటీలో మరో ఇండోర్ స్టేడియం నిర్మాణంలో ఉందని త్వరతోనే అందుబాటులో తేనున్నట్లు చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి పనులు తుదిదశ కు చేరుకున్నాయని, పెండింగ్ పనులను కూడా విడతల వారీగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెవాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షడు మహ్మద్ గౌసుద్దీన్, వీరారెడ్డి, లింగాల ఐలయ్య, పిల్లి తిరుపతి, రోణంకి జగన్నాథం, మస్తాన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, అబ్దుల్ హమీద్ తదితరలు పాల్గొన్నారు.