జవహర్‌నగర్, జూలై 13: జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డు ఎత్తివేయాలనే డిమాండ్‌తో డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ మేక లలితాయాద్ ఆధ్వర్యంలో జవహర్‌నగర్ రాజీవ్‌గాంధీనగర్‌లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమిటీ చైర్మన్ షేక్షావలి షేక్షావలి మాట్లాడుతూ..రాంకీ యాజమాన్యం డంపింగ్‌యార్డ్‌ను తొలగించే వరకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్రలు, ఆటపాటలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలోఅరుణ, సునీతా, శివబాబు, స్వరూప, లక్ష్మిబాయ్, సావిత్రి, వేణు, కాలేషా, డంపింగ్‌యార్డ్ పరిసర ప్రాంతాల కాలనీవాసులు పాల్గొన్నారు.