సిటీబ్యూరో, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ) : వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండీఏ భూములకు రక్షణ కల్పించేలా డిజిటల్ హద్దుల నిర్ధారణ ప్రక్రియ పడకేసింది. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను నియంత్రించేలా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేయాలని భావించారు. గతంలో మియాపూర్ భూముల ఆక్రమణల నేపథ్యంలో తెరమీదకు వచ్చిన ఈ విధానంపై ఇప్పటికీ హెచ్ఎండీఏ చర్యలు తీసుకోలేదు. దీంతో వేల కోట్ల భూములకు రక్షణ కరువైన నేపథ్యంలో.. గూగుల్ మ్యాప్‌లో వాటి సరిహద్దులను గుర్తించడం ద్వారా ఆక్రమణలకు తావులేదని, కబ్జా చేయడానికి అవకాశం ఉండదు. కానీ జీఐఎస్ ఫెన్సింగ్ ప్రణాళికలను ఇప్పటికీ అమలులోకి రాలేదు.
11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏకు 3వేల ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ ఉంది. వీటిని మాన్యువల్ హద్దుల నిర్ధారణ, ఫెన్సింగ్తోనే ఇన్నాళ్లు నెట్టుకొస్తుంది. అధునాతన టెక్నాలజీ సాయంతో వేల కోట్లు విలువ చేసే భూములకు రక్షణ కల్పించే వీలు ఉన్నా, పూర్తి స్థాయిలో అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. గూగుల్ మ్యాప్‌లో అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తించడమే కాకుండా, భౌతికంగా భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయకుండా నెట్టుకొస్తుంది. దీంతో కీలకమైన భూ ములకు కబ్జాల ముంపు పొంచి ఉంది. ఆక్రమణలపై అధికారులకు ఫిర్యాదులు వస్తేనే కూ ల్చివేతలతో హడావుడి చేస్తున్నారు గానీ కబ్జాలకు నియంత్రించేలా చర్యలు తీసుకోవ డం విఫలం అవుతున్నారనే ఆరోపణలున్నా యి.
నగరంలో మియాపూర్ భూముల కబ్జా తర్వాత హెచ్ఎండీఏ జీఐఎస్ మ్యాపింగ్ కోసం ప్రణాళికలు రూపొందించింది. కానీ ఆ బాధ్యతలను ఏజెన్సీకి కూడా అప్పగించిన సమయంలోనే హెచ్ఎండీఏలోని ఇతర భూములకు కూడా జియో ఫెన్సింగ్ అమలు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఆ భూముల ఆక్రమణ, కంచె ఏర్పాటుతో డిజిటల్ ఫెన్సింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ప్ర స్తుతం 3వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ హెచ్ఎండీఏకు ఉన్నప్పటికీ ఇప్పటికీ సరైన హ ద్దులు లేక నిత్యం ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయి.