సరిహద్దుల్లో కాపుకాసి..నేపాలీ గ్యాంగ్‌ను పట్టేసి..
జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుకోగా.. మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం..
- జూబ్లీహిల్స్ చోరీ కేసులో పురోగతి..
- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు.. మరొకరి కోసం గాలింపు
బంజారాహిల్స్,ఫిబ్రవరి 9: జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుకోగా.. మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్ రోడ్ నం. 69లోని నందగిరిహిల్స్‌లో నివాసం ఉంటున్న రవీంద్రకుమార్ శర్మ అనే వ్యాపారి ఇంట్లో గత నెల 18న వం టమనిషిగా చేరిన భూపేందర్ షాహీ తన జన్మదినం అంటూ శుక్రవారం సాయంత్రం తనతో పాటు పనిచేస్తున్న ఇద్దరు సహోద్యోగులను నమ్మించి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి నేపాలీ గ్యాంగ్ సాయంతో చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలం నుం చి పారిపోయే క్రమంలో భూపేందర్ షాహీకి చెందిన ఓ సెల్‌ఫోన్ కిందపడిపోవడంతో దానిలో లభ్యమయిన అధారాలతో పాటు నేపాలీ ఏజెంట్ మధన్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును కొనసాగించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్లతో పాటు గతంలో భూపేందర్ షాహీ వాడిన సెల్ఫోన్లో కొన్ని కీలక విషయాల ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. నిందితులు సరిహద్దులు దాటి నేపాల్‌కు వెళ్లిపోయేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించా రు.
నేపాల్‌కు వెళ్లే మూడు సరిహద్దులకు నగర పోలీసు బృందాలు చేరుకుని మూడురోజుల పాటు కాపు కాశాయి. సరిహద్దు భద్రతాదళం సహకారంతో నిందితులపై నిఘా పెట్టి.. సరిహద్దు చెక్‌పోస్ట్‌కు సమీపంలో భూపేందర్ షాహీతో పాటు మరో వ్యక్తిని పట్టుకున్నారు. వీరి నుంచి కొంత సొత్తును స్వాధీనం చేసుకుని నగరానికి తీసు కువస్తున్నట్లు సమాచారం. కాగా చోరీ అనంతరం నలుగురు నిందితులు చోరీ సొత్తును పంచుకున్నారని, వేర్వేరుగా ప్రయా ణిస్తూ సరిహద్దులు దాటాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోం ది. కాగా చోరీలో పాల్గొన్న మరో నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

