Hyderabad | రిజర్వాయర్లు, వాటర్ ట్యాంక్‌ల వద్ద సెక్యూరిటీ గార్డులు
Hyderabad | హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో వాటర్ ట్యాంక్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని జలమండలి ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకర్ల వద్ద భద్రతకు చర్యలు

హైదరాబాద్ : హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలో వాటర్ ట్యాంక్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని జలమండలి ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకర్ల వద్ద భద్రతకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మూడంచెల క్లోరినేషన్తో నాణ్యమైన నీరు అందిస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకర్ల వద్దకు ఇతరులను అనుమతించమని స్పష్టం చేశారు.
రేపు 100 మంది ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల నియామకం చేపడుతామని ప్రకటించారు. మరో 200 మంది జలమండలి సిబ్బందితో భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. రిజర్వాయర్లు, వాటర్ ట్యాంకుల వద్ద 600 సీసీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రిజర్వాయర్ల భద్రత తనిఖీకి 4 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తామని జలమండలి ఎండీ దాన కిశోర్ ప్రకటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

