సిటీబ్యూరో: సైబర్‌నేరగాళ్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఫేక్ వీడియోను పెట్టి.. ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి లక్షలు కాజేశారు. కర్మన్‌ఘాట్‌కు చెందిన బాధితుడు సోషల్‌మీడియా బ్రౌజ్ చేస్తుండగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉన్న ఓ ఫేక్ వీడియోను చూశాడు. ఈ ఫేక్ వీడియోలో.. పెట్టుబడి పెడితే నెల రోజుల్లో భారీ లాభాలొస్తాయనే సందేశం ఉంది. నమ్మిన బాధితుడు క్లిక్ చేయడంతో క్వాంటర్ ఏఐ నాక సొల్యూషన్స్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో అప్లికేషన్ ఓపెన్ అయింది.
అందులో సూచించిన విధంగా బాధితుడు అన్ని వివరాలు పంపించడంతో అకౌంట్ క్రియేట్ చేశారు. సైబర్ నేరస్తులు రూ. 21 వేలు మొదట పెట్టుబడి పెట్టడంతో కొంత లాభం చూపించారు. దశలవారీగా మొత్తం రూ. 42.30 లక్షలు పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్‌పై కోట్ల రూపాయలు కనిపిస్తున్నా.. వాటిని విత్ డ్రా చేసుకునే అవకాశం లేకుండాపోయింది.