టార్గెట్.. టార్గెట్.. రవాణా శాఖ అధికారులపై ఒత్తిడి
రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
- వాహనదారుల వివరాలతో ప్రత్యేక డ్రైవ్లు
- జరిమానాల వసూళ్లే లక్ష్యంగా రేయింబవళ్లు విధులు
సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణంగా అనుమానం వచ్చిన వాహనాన్ని నిలిపివేసి పత్రాలన్నింటినీ పరిశీలిస్తారు. కానీ ఇప్పుడు అన్ని వాహనాలను పరిశీలించి ఏదో ఒక అంశంలో జరిమానాయే లక్ష్యంగా పనిచేయాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
టార్గెట్లు రీచ్ కావడానికి చిన్న చిన్న తప్పిదాలను కూడా అధికారులు ఫైన్లు వేస్తున్నారు. ఎలాగైనా టార్గెట్ రీచ్ కావాలంటూ ఉన్నతాధికారులు సైతం ప్రతీరోజు పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఉదయం, రాత్రి తేడా లేకుండా వాహన తనిఖీల్లో అధికారులు నిమగ్నమయ్యారు. గడువు తీరిన, లైసెన్స్లేని, ఓవర్ లోడ్, నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల వాహనాల రాకపోకలపై దృష్టి సారించారు.
ప్రస్తుతం చెక్పోస్టులు ఎత్తివేయడంతో అక్కడ పనిచేసిన ఉద్యోగులను, ఆర్టీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంవీఐ, ఏఎంవీఐలతో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేశారు. జరిమానాలు చెల్లించకుండా ఉన్న వాహనదారుల వివరాలతో అధికారులు ప్రత్యేక డ్రైవ్లు చేపడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కార్యాలయాల్లో అధికారులు టార్గెట్ రీచ్ అవడమే లక్ష్యంగా పనిచేస్తుండటం విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

