బెంగళూరు : నటుడు ప్రకాశ్‌రాజ్ మరోసారి ఎన్నికల సంఘం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఓటరు లిస్టు నుంచి ఈసీ అధికారులు కావాలనే తన ఓటు తొలగించారంటూ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఓ పోస్టు పెట్టారు. ‘ఎన్నికల సంఘం అధికారులు మారిపోయారు.
నా పేరు తొలగించారని వీడియో పెట్టిన తర్వాత వాళ్లే నాకు ఫోన్ చేసి పొరపాటు జరిగింది సరిచేస్తాం అన్నారు. కానీ మీడియా ముందు కావాలనే నా గురించి తప్పుగా మాట్లాడారు. ఎలాంటి విచారణ చేయకుండానే “పర్మినెంట్‌గా షిఫ్ట్ అయ్యారు” అని వాళ్ల వెబ్సైట్లో పెట్టారు.