హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నర్సింగ్ సిబ్బంది వృత్తిపరమైన ప్రయోజనాలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న తెలంగాణ నర్సెస్ అసోసియేషన్(టీఎన్ఏ)కు ఆల్ ఇండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్(ఏఐజీఎన్ఎఫ్) ఈ ఏడాదికి అధికారిక అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. తెలంగాణ నర్సుల అసోసియేషన్ గురువారం ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడిగా పుట్ట లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకిలో జరిగిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ 90వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ను జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.