సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): గతేడాది మాదిరిగానే భూగర్భ జలా లు అడుగంటడంతో ట్యాంకర్లు పెరిగే అవకావం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంక ర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలోని ఫిల్లింగ్ స్టేషన్‌ను అధికారులతో కలిసి ఎండీ అశోక్ రెడ్డి శనివారం సందర్శించారు. గత కొన్ని రోజులుగా ట్యాంక ర్ బుకింగ్స్ పెరగడం, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ మీద దృష్టి సారించడంలో భాగంగానే తొలుత ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం, ట్యాంకర్ ఫిల్లిం గ్, టోకెన్ జనరేషన్ వివరాలను తనిఖీ చేశా రు.
ఈ సందర్భంగా వాటర్ బోర్డు ఎండీ అశో క్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్రాంతం లో ఉన్న మూడు ఫిల్లింగ్ స్టేషన్లతో పాటు మ రో మూడు ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిమాండ్‌ను బట్టి ట్యాంక ర్ల సంఖ్యను పెంచుకోవాలన్నారు. ఒక ట్యాం కర్ ఫిల్లింగ్ స్టేషన్ లోపలికి వచ్చి, నీటిని నిం పుకుని బయటకు వెళ్లేందుకు దాదాపు ఎనిమిది నుంచి 10 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. ఈ సమయాన్ని ఐదు నిమిషాలకు తగ్గిస్తే ఒక రో జులో రెట్టింపు ట్యాంకర్లను డెలివరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. సమయాన్ని తగ్గించుకోవడానికి స్టేషన్ల పరిసరాల్లో పలు మార్పులు చేర్పులు చేయాలని సూచించినట్లు తెలిపారు. ట్యాంకర్లు బుక్కయ్యే ఫిల్లింగ్ స్టేషన్లో అదనపు ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పగటి సమయంలో గృహ వినియోగదారులకు, రాత్రి వేళల్లో హాస్టళ్లు, హోట ళ్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ట్యాంక ర్ ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు.
దీం తో వెయిటింగ్ పిరియడ్, పెండెన్సీ తగ్గించవచ్చని చెప్పారు. బుకింగుల్లో అక్రమాలకు పా ల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ట్యాంకర్ టోకెన్‌పై బార్కోడ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల ప్రతి ట్యాంకర్ ట్రిప్పుల లెక్కలు ప క్కాగా ఉంటాయని తెలిపారు. మరుగు దొడ్లు, వెయింటింగ్ రూమ్‌లు లేని ఫిల్లింగ్ స్టేషన్లలో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయంలో లైటింగ్ సరిగ్గా ఉండే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీటిని ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి అనుసంధానంగా ఉంటాయని చెప్పారు. కా ర్యక్రమంలో జీఎం బ్రిజేష్, డీజీఎం, మేనేజర్లతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.