హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి(Prajavani) కార్యక్రమం రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నది. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, కోడ్ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానున్నది. ప్రజాభవన్లో (Prajabhavan) మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కొనసాగనున్నది. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు.