జిల్లా కలెక్టర్ హరీశ్
ప్రజావాణిలో 35 వినతుల స్వీకరణ
మేడ్చల్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి , ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వల్ల రెండేండ్లుగా నిలిచిపోయిన ప్రజావాణిని తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో జిల్లా అధికారులందరూ పాల్గొంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణిలో 35 వినతులు…
ప్రజావాణిలో వివిధ సమస్యలపై 35 వినతులను అధికారులు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలు, పింఛన్లకు సంబంధిత వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన వినతులను పరిశీలించి వచ్చే సోమవారం వరకు పరిష్కరించనున్నట్లు జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు మల్లయ్య, రవి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.