నిమ్స్‌లో పవర్‌కట్
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్‌లు ఉంటాయి. ఒక్కోసారి అది పనిచేయకుంటే పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది. నిమ్స్ దవాఖానలో శుక్రవారం అదే జరిగింది. పాత భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది.
- ఆపరేషన్ థియేటర్లో కంగారుపడ్డ వైద్యులు
- ఓవర్ లోడ్‌తో సమస్య: మెడికల్ సూపరింటెండెంట్
ఖైరతాబాద్: ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్‌లు ఉంటాయి. ఒక్కోసారి అది పనిచేయకుంటే పరిస్థితి గందరగోళంగా మారిపోతుంది. నిమ్స్ దవాఖానలో శుక్రవారం అదే జరిగింది. పాత భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. సరఫరా నిలిచిపోతే.. వెంటనే యూపీఎస్ బ్యాకప్ వస్తుంది. కానీ నిమ్స్‌లో బ్యాకప్ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్లోని వైద్యులు కంగారుపడినట్లు సమాచారం. ఆపరేషన్ చేస్తున్న సమయంలో కరెంటు పోవడంతో డాక్టర్లు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ టెక్నిషియన్‌కు ఫోన్ చేస్తే సకాలంలో స్పందించనట్లు సమాచారం.
ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు కరెంటు లేక సుమారు అరగంట ఉక్కిరిబిక్కిరైనట్లు తెలిసింది. ఎట్టకేలకు ఎలక్ట్రీషియన్‌ను రప్పించగా సరిచేసినట్లు సమాచారం. ‘ఎండాకాలం కావడంతో విద్యుత్ లోడ్ అధికమై ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యుత్ సరఫరా కొంతసేపటి వరకు నిలిచిపోయిన విషయం నిజమే. అప్పుడప్పుడు లోడ్ పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం’ అని వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

