కీసర: కీసరలోని డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ఇంటి పట్టాలు లేవంటూ.. విద్యుత్‌ను నిలిపివేశారు అధికారులు. దీంతో లబ్ధిదారులు నేరుగా మండల తహసీల్దార్ అశోక్‌కుమార్‌ను కలిసి..ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ.. వినతిపత్రాన్ని అందజేశారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు లేనందున విద్యుత్‌ను నిలిపివేస్తున్నామని విద్యుత్ అధికారులు హెచ్చరిస్తున్నారని, ఇండ్లు కేటాయించిన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను ఇవ్వాలని తహసీల్దార్‌ను కోరారు.