హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3 : ఈ నెల డిసెంబర్ 6న హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగే అఖిలభారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సును విజయవంతం చేయాలని నాయకులు మండల కుమారస్వామి, ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం నేడు సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉందని, మోదీ పాలనలో కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద విధానాల కింద నలిగిపోతూ సీఏఏ ఎన్ఆర్సీ విధానాలను తీసుకువచ్చి ప్రజల మధ్య మతవిద్వేష పూరిత పరిస్థితులను కల్పిస్తుందన్నారు.
ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక మార్గదర్శకం ప్రవేశపెట్టి మనుధర్మ శాస్త్రం నియమాలని వారు అనుకున్న ప్రకారం భారతదేశంలో సాగిస్తుందన్నారు. పేద ప్రజలను విభజిస్తూ పాలిస్తుందని మండిపడ్డారు. కార్పొరేట్ ప్రపంచీకరణ విధానాలను తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిప్డారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గడ్డం శరత్, సంపత్ కుమార్, రాచర్ల బాలరాజు, గురుమిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.