Shabbir Ali | కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయే పార్టీగా తయారైందంటూ స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. డబ్బులు పెట్టి, పండబెట్టి పదవులు తీసుకుంటున్నారంటూ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు.
కాగా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీకి కాంగ్రెస్ హైకమాండ్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో గాంధీభవన్ వద్ద షబ్బీర్ అలీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి.
షోకాజ్ నోటీసులు అందుకున్న షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీ భవన్లో పోస్టర్లు వెలియడం చర్చనీయాంశంగా మారింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ చాంపియన్ షబ్బీర్ అలీని మేము నమ్ముతామంటూ వెలిసిన పోస్టర్ ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతోంది.
షబ్బీర్ అలీ Vs కాంగ్రెస్
షోకాజ్ నోటీసులు అందుకున్న షబ్బీర్ అలీకి మద్దతుగా గాంధీ భవన్లో పోస్టర్లు https://t.co/YoDbqCy5yd pic.twitter.com/bBInI6MxT2
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!