సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఒడిశా కేంద్రంగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.7లక్షల విలువైన 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ క థనం ప్రకారం.. ఒడిశా బరంపూర్‌కు చెందిన నకుల్ యాద వ్(27) స్వగ్రామం నుంచి గంజాయిని నగరానికి తరలించాడు. శేరిలింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో డెలివరీ చేసేందుకు కోసం నిరీక్షిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ బృందం దాడి చేసి నకుల్ యాదవ్‌ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ. 7లక్షల విలు వచేసే 14 కిలోల గంజాయి, రూ. 2,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మల్కాజిగిరిలో…
ఫతేనగర్‌కు చెందిన వానిక(40) తన నివాసంలో గంజాయి విక్రయిస్తున్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు నిందితురాలి ఇంటిపై దాడులు నిర్వహించారు. 620గ్రాముల గంజాయి లభించింది. దీంతో నిందితురాలు వానికను అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
బాలానగర్‌లో…
నెల్లూరుకు చెందిన సి.అఖిల్‌బాబు కేపీహెచ్‌బీ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. సమాచారం అందుకున్న బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అఖిల్బాబును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 470గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.