నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకం
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్, పర్యవేక్షణ, నిర్వహణ, విస్తరణపై బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీ రమేశ్ వాటి నిర్వహణపై అధికారులతో చర్చించారు.
- ‘నేను సైతం’ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేశ్
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేశ్ అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల జియో ట్యాగింగ్, పర్యవేక్షణ, నిర్వహణ, విస్తరణపై బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీ రమేశ్ వాటి నిర్వహణపై అధికారులతో చర్చించారు.
అనంతరం సీపీ మా ట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే ప్రతి కెమెరానూ వెంటనే జియో ట్యా గింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ వ్యవస్థ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అడ్మిన్‌ను నియమించి, కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూ చించారు. పనిచేయని కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేయించి, ఇప్పటికే ఉన్న కెమెరాలను పోలీస్ పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానం చేయాలన్నారు.
అదేవిధంగా సైబరాబాద్ వ్యాప్తంగా డీవీఆర్ వ్యవస్థలను దశలవారీగా ఎన్వీఆర్ విధానానికి మార్చేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్లలోని సీసీటీవీ నెట్ వర్ ను సెంట్రల్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానం చేయడం ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ, వీడియో రికార్డింగ్, ఫుటేజీ నిల్వ, అవసరమైన సమయంలో ఆధారాల సేకరణ, విశ్లేషణ మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆయన పేర్కొన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసిన వెండర్లు వాటి నిర్వహణ, సాంకేతిక లోపాల పరిషారం, సేవలపై పూర్తి బాధ్యత వహించాలని సీపీ స్పష్టం చేశారు.
జియో ట్యాగింగ్ ప్రక్రియ, సాఫ్ట్వేర్ వినియోగం, కెమెరాల నిర్వహణపై అధికారులు, సిబ్బంది, వెండర్లకు ప్రత్యేక శిక్షణ, ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించాలని సూచించారు. తద్వారా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ‘నేను సైతం’ కార్యక్రమాన్ని మరింత విస్తరించి, నివాస గృహాలు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్స్టేషన్లతో అనుసంధానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతికత తో సైబరాబాద్ కమిషనరేట్‌ను సురక్షితమైన ప్రాంతంగా తీర్చిదిద్దవచ్చని కమిషనర్ పేరొన్నారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

