HMWSSB | ముషీరాబాద్, మే 14 : రాంనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి సరఫరా స్థానికులను ఆందోళన గురిచేస్తుంది. పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన జలమండలి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే నీటి సరఫరా చేయడంతో మురుగు నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సాగర్ లాల్ ఆసుపత్రి వద్ద భారీ పైప్ లైన్ నిర్మాణం చేపట్టిన అధికారులు జాగ్రత్తలు తీసుకోకుండానే నీటి సరఫరా చేశారు. దీంతో పలు బస్తీలకు కలుషిత నేటి సరఫరా జరిగింది. దీంతో స్థానికులు ఏం చేయలేక తాగునీటినీ పడేశారు.
రాంనగర్ డివిజన్లోని హరి నగర్, అబ్బసాయి అపార్ట్మెంట్ లైన్, కృష్ణనగర్, ఎస్.ఆర్.టీ కాలనీ, అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాలలో మంచినీటి నల్లాల్లో మురికి నీటి సరఫరా జరిగింది. స్థానికులు ఎవరు కూడా నీరు పట్టుకోకుండా వదిలివేయడం జరిగింది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ముదిగొండ మురళి, నీలాదేవి సమస్యను జలమండలి డీజీఎం మోహన్ రాజ్ తీసుకువెళ్లడంతో సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.