సిటీబ్యూరో, నవంబరు 14 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త విధానాలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ నెల 30న జరిగే ఎన్నికలలో 75 పోలింగ్ స్టేషన్లు ప్రత్యేకంగా నిలనున్నాయి. యువత, మహిళలు, దివ్యాంగులు ఓటింగ్ శాతం పెంపొందించే సంకల్పంతో వీరికి ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. థిమటిక్ పేరిట మహిళలు, యువత, దివ్యాంగులకు స్పెషల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లా 15 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా మహిళా నిర్వహణలో 75 పోలింగ్ స్టేషన్లు, 15 పీడబ్ల్యూడీ చొప్పున మరొక 15 యూత్ మేనేజ్మెంట్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు 75 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.