మల్కాజిగిరిలో పోలింగ్ ప్రశాంతం
మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు ఉత్సాహంగా వచ్చారు. పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి మొరాయించాయి.
- గత ఎన్నికలతో పోల్చితే తగ్గిన పోలింగ్ శాతం..
- పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు…పోలింగ్ ఆలస్యం..
- సాయంత్రం 5గంటల వరకు 46.8 శాతం పోలింగ్ నమోదు
మల్కాజిగిరి, నవంబర్ 30: మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 46.80 శాతం జరిగింది. పోలింగ్ కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు ఉత్సాహంగా వచ్చారు. పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అవి మొరాయించాయి. దీంతో పోలింగ్ ప్రక్రియ నిర్దే శించిన సమయం కంటే దాదాపు అరగంట ఆలస్యంగా మొదలు కా వడంతో ఓటర్లు అసౌకర్యానికి గురయ్యారు. ఆర్కె.పురం, సాయినాథ్‌పురం, మధురానగర్‌లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ అరగంట ఆలస్యంగా మొ దలైంది. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలను సరి చేయడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది.ఉదయం 7 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు 5.8శాతం, ఉదయం 11గంటల వరకు 14.21శాతం, మధ్యాహ్నం 1గంట వరకు 26.9శాతం, మూడు గంటల వరకు 36.37శాతం, సాయంత్రం 5గంటల వరకు 46.8 పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో సుమారు 53శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి తగ్గటం గమనార్హం.
బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బోయిన్‌పల్లిలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్,క్యానం రాజ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు జగదీష్‌గౌడ్, ఆకుల నర్సింగరావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచే మల్కాజిగిరి నియోజకవర్గం ఎన్నికల అధికారి రవికిరణ్ పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే..ఎన్ఆర్ఐ సిక్కా చంద్రశేఖర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ శ్రీదేవి హన్మంతరావు, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

