సికింద్రాబాద్‌లోని రూబీ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనాస్థలంలో పోలీసులు, రవాణా, అగ్నిమాపకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సెల్లార్లో ఎలక్ట్రిక్ షోరూంలో మంటలు అంటుకొని లాడ్జికి కూడా అంటుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే సెల్లార్ ప్రాంతంలోని సీసీకెమెరా ఫుటేజీని అధికారుల బృందం తీసుకెళ్లింది. అలాగే జనరేటర్లు, సిలిండర్లు, ఈ-మోటార్ల ఫొటోలు తీసుకున్నారు. హోటల్ మేనేజర్ సుదర్శన్‌ను ఘటనాస్థలానికి తీసుకెళ్లిన పోలీసులు అక్కడే అతన్ని రకరకాల ప్రశ్నలు వేసి, సమాధానాలు తెలుసుకున్నారు.