హైదరాబాద్ : శంషాబాద్(Shamshabad) పరిధిలో నకిలీ సాస్‌లు(Adulterated sauce) తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీబాలాజీ ఇండస్ట్రీస్‌పై ఎస్వోటీ పోలీసులు దాడి చేసి హానికార రసాయ నాలు, సింథటిక్ రంగులతో సాస్ తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసటిక్ యాసిడ్, ఇతర సమాగ్రిని స్వాధీనం(Police seized) చేసుకున్నారు. మొత్తంగా రూ.3.50 లక్షల విలువైన కల్తీ సాస్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.