హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పలు పబ్‌లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మాదాపూర్‌లోని అకాన్ పబ్‌లో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా గచ్చిబౌలిలోని ఏ19 పబ్‌లో మరొకరికి మరొకరికి గంజాయి పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.