రవీంద్రభారతి, మే10 ;తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణకు, పోలీస్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత దేశంలో మరే రాష్ట్రం ఇవ్వలేదని హోం మంత్రి మహమూద్‌అలీ అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 281 మంది పోలీస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు సేవా పతకాలను బుధవారం రవీంద్రభారతిలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ అభిలాష్ బిస్త్,ఏసీబీ డీజీ రవిగుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రాజీవ్త్రన్, హైదరాబాద్ సీపీ
సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు విజయ్‌కుమార్, షిఖాగోయల్, స్వాతిలక్రా, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐజీలు కమలహాసన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసీం, రమేశ్ సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.