హైదరాబాద్ : బీఫార్మసీ విద్యార్థిని(B pharmacy student) హారికను ఢీ కొట్టిన స్కూల్ బస్సును(School bus) పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రంగారెడ్డి స్కూల్ బస్సును రాజేంద్రనగర్ పోలీసులు సీజ్(Police seized) చేశారు. వివరాల్లోకి వెళ్తే..అత్తాపూర్ రెడ్డి బస్తీకి చెందిన హారిక పిల్లర్ నెంబర్ 130 వద్ద మంగళవారం ఉదయం రోడ్డు దాటుతుండగా ఓ పాఠశాలకు చెందిన బస్సు అమెను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో అమె కింద పడి తీవ్ర గాయాల పాలైయింది. స్థానికలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అమెను స్థానిక హాస్పిటల్లో చేర్చించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బుధవారం డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !
Spurthi Reddy | ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించిన జలమండలి మేనేజర్ స్పూర్తిరెడ్డి..!
MS Dhoni | లోకల్ ధాబాలో ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న ధోనీ.. పిక్స్ వైరల్