వినాయక మండపాలపై ప్రత్యేక నిఘా
గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు మహానగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
- నిర్వాహకులకు అవగాహన కార్యక్రమాలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు మహానగరంలోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈసారి వినాయక నిమజ్జనం, ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగ ఒకేరోజు వచ్చే అవకాశం ఉండటంతో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ఉండేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసే ప్రతి మండపంపై ప్రత్యేక నిఘా పెట్టేలా చర్యలు తీసుకున్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే ఖైరతాబాద్, బాలాపూర్ గణేశ్ మండపాలతో పాటు పాతబస్తీ, బేగంబజార్ తదితర సున్నిత ప్రాంతాల్లోని మండపాల వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి గణేశ్ మండపంలో బుక్ పాయింట్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతిరోజు బీట్ పోలీసులు గణేశ్ మండపంలోని బుక్పాయింట్లో సంతకం చేయాలని, మండపాల వద్ద ఏవైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాత్రి 10గంటల తరువాత సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం స్పీకర్లు పెట్టవద్దని, మండపాలలో పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

