సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలలో హషీష్ ఆయిల్‌ను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ స్మగ్లర్లను ఎస్ఓటీ మల్కాజిగిరి, భువనగిరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 80 లక్షల విలువైన నాలుగు కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, నర్సిపట్నం మండలానికి చెందిన పేట్ల శేఖర్ బీఎస్సీ కెమిస్ట్రీ చదివి ఖాళీగా ఉన్నాడు. అతనికి గంజా యి సరఫరా చేసే గంజా దుర్గా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. గంజాయిని హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉందని, అవసరమైన వారికి సరఫరా చేసి మంచి లాభాలు సంపాదించవచ్చని సూచించాడు. హైదరాబాద్ సమీపంలోని భువనగిరి వరకు హషీష్ ఆయిల్‌ను సరఫరా చేస్తే అక్కడి నుంచి ఈజీగా హైదరాబాద్‌కు తీసుకెళ్లవచ్చని సూచించాడు.
దీంతో నాలుగు కిలోల హషీష్ ఆయిల్‌ను శేఖర్, అన్మిరెడ్డిలకు అం దజేశాడు. దీంతో ఆ డ్రగ తీసుకొని ఇద్దరు భువనగిరికి 11వ తేదీన రైల్లో వచ్చి, భువనగిరి ప్రాంతాలోని అనంతారం సర్వీస్ రోడ్డుపై తిరుగుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ మల్కాజిగి రి బృందం భువనగిరి పోలీసులతో కలిసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు.
వారి వద్ద లభించిన బ్యాగ్‌లో 4 కిలోల హషీష్ అయిల్ లభించడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. 40 నుంచి 50 కిలోల గంజాయితో ఒక కిలో హషీష్ అయిల్ను తయారు చేస్తారని, సుమారు 200 కిలో గంజాయిని ఉపయోగించి నాలుగు కిలోల హషీష్ అయిల్ను డ్రగ్ స్మగ్లింగ్ ముఠా తయారు చేసిందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ రూ. 80 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ఈ ము ఠాకు డ్రగ్స్ అందించిన సూత్రదారి గంజా దుర్గా కోసం గాలిస్తున్నామని సీపీ తెలిపారు. డ్రగ్స్ అమ్మేందుకు, కొనేందుకు ఎవరైనా ప్రయత్నిస్తున్నట్లు ప్రజల దృష్టికి వెస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నిందితుల వద్ద నుంచి హషీష్ ఆయిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి డీసీపీ ఆక్షంష్యాదవ్, మ ల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి, అదనపు డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి అధికారులు పాల్గొన్నారు.